Sunday, December 29, 2024

ముగిసిన సిబిపి కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇపిటిఆర్‌ఐలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు వారాల పాటు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఇపిటిఆర్‌ఐ)లో కేంద్ర మంత్రిత్వ శాఖ సీనియర్ శాస్త్రవేత్తలకు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని (సిబిపి) నిర్వహించింది. ప్రాంతీయ కార్యాలయాల నుంచి పదిహేను మంది సీనియర్ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో జాతీయ జీవవైవిధ్య బోర్డు చైర్‌పర్సన్ సి.అచలేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.శోభ, ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ ఎ. వాణీప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News