Monday, December 23, 2024

10, 12 తరగతులకు రెండు వార్షిక పరీక్షలు

- Advertisement -
- Advertisement -

పదవ, పన్నెండవ తరగతులకు వార్షికంగా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు సరైన విధివిధానాలను రూపొందించాలని సిబిఎస్‌ఇని కేంద్ర విద్యామంత్రిత్వశాఖను ఆదేశించింది. 202526 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండుసార్లు పరీక్షల విధానం అమలులోకి తీసుకరావాలని కూడా తెలిపారు. విద్యార్థులలో పరీక్షల పట్ల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, సిలబస్ భారం సమరీతిలో ఉండేలా చేసేందుకు చాలా కాలంగా ఈ పద్థతిని తీసుకురావాలని విద్యా మంత్రిత్వశాఖ ఆలోచిస్తోంది.

అయితే సెమిస్టర్ పద్దతిని తీసుకువచ్చే ప్రసక్తే లేదని అధికారులు తెలిపారు. కాగా రెండుసార్లు పరీక్షల పద్థతి నిర్బంధం ఏమీ కాదని , ఇది ఆప్షన్‌గా ఉంటుందని , రెండుసార్లు రాసిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్షలను వర్తింపచేస్తారని, ఇక రెండు సార్లు పరీక్షలకు వెళ్లకుండా ఒకేసారి పరీక్షలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుందని , రెండుసార్లు నిబంధన ఐచ్చికం అని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News