- Advertisement -
న్యూఢిల్లీ: 10,12 తరగతుల బోర్డు పరీక్షల కోసం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సూచించారు. పరీక్షలను రద్దు చేయాలి లేదంటే రీ షెడ్యూల్ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థులపై మాససిక ఒత్తిడి ఉంటుందని ఆమె హితవు పలికారు. మే 4నుంచి జూన్ 7వరకు 10వ తరగతి, మే 4 నుంచి జూన్ 15వరకు 12వ తరగతి పరీక్షలకు సిబిఎస్‌ఇ షెడ్యూల్ ప్రకటించింది. భౌతిక దూరం నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాలను 4050శాతంమేర పెంచనున్నట్టు సిబిఎస్‌ఇ తెలిపింది.
- Advertisement -