Friday, November 22, 2024

నేరాల ఛేదనకు సిసి కెమెరాలు కీలకం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ప్రస్తుత రోజుల్లో నేరాలను నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రిలో సిసి కెమెరాల పనితీరును జిల్లా ఎస్‌పి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఎలాంటి నేరాలు జరిగినా వాటిలోని నేరస్తులను కనుగొనడంలో సిసి కెమెరాలు పోలీసులకు ఒక ఆయుధంగా నిలుస్తోందన్నారు. సిసి కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న గ్రామాల్లో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సిసి కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని సిసి కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపారు.

సిసి కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. నేర నియంత్రణకు నేరాల ఛేదనకు సిసి కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. సిసి కెమరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర ఎమర్జెన్సీ వార్డును ఎస్‌పి పరిశీలించారు.

ఎమర్జెన్సీ వార్డుకు రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు హాస్పిటల్‌లుకు వచ్చే బాధితుల యొక్క వివరాలు నమోదు చేయాలని, అదే విధంగా సంబంధిత పోలీసు వారికి సమాచారం అందించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి ప్రకాష్, టౌన్ ఇన్స్‌పెక్టర్ నటేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News