హస్తినాపురం: ఎల్‌బినగర్ నియోజకవర్గంలో 970 కాలనీలకు గాను 70 కాలనీల్లో కొత్తగా సిసి కెమెరాల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి నుండి నిధు లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. హస్తినాపురం డివిజన్ ఇంద్రప్రస్థ ఫేస్ 1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం కాలనీ అభివృద్ధి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే హజరై కాలనీలోని అన్ని వీధులను పరిశీలించి కాలనీ సంఘం సమావేశంలో పాల్గొన్నా రు. కాలనీ అధ్యక్షులు వి.యోగీశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రాంరెడ్డి, కోశాధికారి నాగయ్య పలువురు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమ కాలనీలో ప్ర భుత్వ నిధులతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, కమ్యూనిటీ హాలు నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజవర్గంలోని అన్ని కాలనీలకు సిసి కెమెరాలు మంజూరు చేయించే పనిలో ఉన్నాను అందులో మీ కాలనీ కి మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు. సిసి కెమెరాలు అమర్చటంతో దొంగతనాలు, నేరాలు ఘోరాలు తదితర తప్పుడు పనులు తుగ్గుతున్నందున ప్రభుత్వ నిధులతోనే కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. పార్కులు, డ్రైనేజి, కమ్యూనిటీ హాలు నిర్మాణం, కృష్ణా నది తాగునీటి స రఫరా పైపులైను ఏర్పాటు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు పరిశీలిస్తానని తెలిపా రు. ఎల్‌బినగర్‌లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప నులు కొనసాగుతున్నాయన్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా సాగర్ రింగు రో డ్డు ను మరింత వెడల్పు చేసేందుకు ఆలోచిస్తు జరుగుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణం గు రి ంచి అవగామన కల్పించారు. ఫ్లై ఓవర్ల కింద 36 రకాల వనమూలికల చెట్లను పె ంచి ఆక్సిజన్ పార్కును సెమీ ఇండోర్‌గా తయారు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇటీవల నిర్మించి గ్రేవ్ యార్డు కొత్తదనం గిన్నిస్ బుక్‌లో ఎక్కబోతుంద ని చెప్పారు. బిఆర్‌ఎస్ డివిజన్ సత్యంచారి, నాయకులు శ్రీనివాస్‌నాయక్, కాలనీ నాయకులు యాదగిరిరెడ్డి, శ్రవన్, రాంరెడ్డి, నాగభూషణం, అంజనేయులు, పా పిరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మల్యాద్రి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.