Sunday, December 22, 2024

ఎల్లిగడ్డలు ఎత్తుకుపోతున్నారు!

- Advertisement -
- Advertisement -

భోపాల్: దొంగతనాలు జరగకుండా ఉండటానికి కాలనీల్లో, ఇండ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారు జనాలు. కానీ రైతులు తన పంట పొలాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విషయం వైరల్‌గా మారింది. అసలు విషయానికొస్తే ఎల్లిగడ్డ ధరలు పెరగడంతో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు, మూడు చోట్లు ఎల్లిగడ్డ బస్తాలు దొంగలు ఎత్తుకొనిపోవడంతో రైతులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. కిలో ఎల్లిగడ్డ ధర రూ.500 వరకు పెరిగింది. దీంతో దొంగల ఎల్లిగడ్డ వైపు మళ్లారు. గతంలో టమాటా రేట్లు పెరిగినప్పుడు తమ పంటను దొంగల నుంచి కాపాడుకోవడానికి రైతులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలో ఐదారు గ్రామాల రైతులు తమ పొలాల్లో ఎల్లిగడ్డ చోరీలు జరుగుతుండడంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో దొంగతనాలు తగ్గాయని రైతులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News