Friday, December 20, 2024

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

- Advertisement -
- Advertisement -

మెదక్ రూరల్: హవేళిఘనపూర్ మండల కేంద్రంలో తన నియోజకవర్గ అభివృద్ధి (సిడిపి)నుంచి మంజూరైన రూ. 10లక్షల సిసి రోడ్డు పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద గల పని ప్రతిపాదిత స్థలంలో కొబ్బరికాయ కొట్టి గుణపంతో తవ్వి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం స్థానిక సర్పంచ్ నోముల సవిత శ్రీకాంత్‌తో కలిసి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవో, పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు.

సమీపంలోని ప్రభుత్వ వైద్యశాల పల్లె దవాఖానాను సందర్శించిన అక్కడ సిబ్బందిని వారి పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి పల్లె దవాఖానాలను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరిస్తే గ్రామాలలోని ప్రజలు, ఆర్‌ఎంపీల వద్దకు ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగి విధులకు హాజరుకాకపోవడంపై ఎమ్మెల్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంఘటన స్థలం నుంచి తక్షణమే జిల్లా వైద్య శాఖ అధికారి చందు నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ పల్లె దవాఖానాలు ఉన్న చోట అయిన రోగులు ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లకుండా ఇక్కడికే రావాలని వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి సీజనల్ వ్యాధులను రాకుండా నివారించాలని ఎమ్మెల్సీ సూచించారు. ఇక్కడికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందిస్తే వాళ్లు ఆర్‌ఎంపీల వద్దకు ఎందుకు వెళ్తారని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఎక్కువగా రోగులు సందర్శిస్తున్న పల్లె దవాఖానాలను ఆప్‌గ్రేడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాదికారికి ఎమ్మెల్సీ సూచించారు.
ఈ పల్లె దవాఖాన మొత్తంలో ఎక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫొటో కనిపించకపోవడంపై అక్కడ సిబ్బందిపై, జిల్లా వైధ్యాధికారిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాదికారికి సూచించారు. హవేళిఘనపూర్ గ్రామానికి చెంది ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిన పార్టీ సీనియర్ కార్యకర్త మూగ ఏసు రాజు ఇంటికి వెళ్లి వారికుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహయం చేసి ధైర్యం చెప్పారు. బాధితుడి భార్యకు ప్రభుత్వం తరపున ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి ఏ ర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, మన్నె లక్ష్మీనారాయణ, యామిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీను నాయక్, సాయాగౌడ్, ఎంపీటీసీ చిట్యాల శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాలేద్, స్థానిక ఉప సర్పంచ్ మోహన్‌గౌడ్, వార్డు సభ్యుడు నాగరాజు, పార్టీ నాయకులు ప్రతాపరెడ్డి, నవీన్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, లక్ష్మయ్య, గణపతి, శ్రావణ్, శ్రీను, రామ్, అభిరామ్, అశోక్, ఎంపీడీవో శ్రీరామ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈ పాండురంగారెడ్డి, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News