Monday, December 23, 2024

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: బోధన్ మండలంలోని భూలక్ష్మి క్యాంప్ గ్రామంలో ఆదివారం సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్డీసిసిబి డైరెక్టర్ గిర్దావార్ రంగారెడ్డి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎంజిఎస్‌ఆర్‌ఇజిఎస్ నిధుల ద్వారా 7 లక్షల 50 వేల రూపాయలు సిసి రోడ్డు నిర్మాణానికి మంజూరైనట్లు తెలిపారు.

ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు ఈరోజు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బోధన్ ఏఎంసి చైర్మన్ విఆర్ దేశాయ్, గ్రామ సర్పంచ్ బిజ్జం వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ వై. శ్రీనివాస్ రెడ్డి, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్‌కుమార్, మండల ప్రధాన కార్యదర్శి సిర్ప సుదర్శన్, ఎంపిటిసి జయశ్రీ భూమారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు భానుప్రకాష్, మాజీ ఎంపిపి దండు పీరయ్య, గ్రామపెద్దలు గోవింద్ రెడ్డి, వార్డు సభ్యులు, వీడిసి సభ్యులు, గ్రామస్తులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News