Monday, December 23, 2024

సిసి రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి పా ర్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. లకా్ష్మరెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డు సరస్వతీ నగర్ కాలనీ, రాజీవ్‌నగర్, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో పర్యటించారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, పార్కులకు 25 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజలతో స్వ యంగా మాట్లాడారు.

కాలనీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల కావాల్సిన సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలిన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బం ది ప్రతి రోజూ చెత్త సేకరిస్తున్నారా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని కాలనీవాసులను ఆరా తీశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మున్సిపాలిటీ పరిధిలో 100 శాతం సిసిరోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్ సతీష్ , బిఆర్‌ఎస్ సీనియర్ నాయకు లు పిట్టల మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News