Sunday, February 23, 2025

కులమనే వ్యర్థవాదన దేనికి?

- Advertisement -
- Advertisement -

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, మన హైదరాబాద్‌లోని సిసిఎంబి సంస్థలు, జన్యుపరమైన పరీక్షల ద్వారా కులం చరిత్రను వివిధ ప్రజల్లో ఉన్న జన్యువులను పరీక్షించారు. అండమాన్, నికోబార్‌లోని ఆదివాసులలో మినహా మిగతా వారందరి లో పెద్దగా తేడాలు లేవని తేల్చారు. ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజల మధ్య కొన్ని తేడాలున్నట్లు గమనించారు. కాని కులాల మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవని గమనించారు. అంతేకాకుండా భారత దేశంలోని కులాలు అన్ని ఒక దానినొకటి కలిసిపోయాయని తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం మీద యురేసియా ప్రభావం ఉంటే, దక్షిణ భారత దేశం మీద దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రజల జన్యువులతో కలుస్తున్నాయని తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.

రాహుల్ గాంధీ వంశం గురించి మాట్లాడితే లేదా ఆయన తల్లిదండ్రులు, తాత నాయనమ్మలు గురించి చెబితే ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఎందుకంటే కులం, మతం పట్టింపులు లేకుండా వాళ్లు తమ జీవితాలను పంచుకున్నారని కొనియాడేవాళ్లు. రాజీవ్ గాంధీ క్రిస్టియన్ అయిన సోనియా గాంధీని, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా క్రిస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. ఇది భారత దేశంలో ఒక మార్గదర్శకమై న జీవన విధానం అభినందించాల్సిందే. అయితే ఇటీవల రాజకీయ ప్రయోజనా ల రీత్యా కులం, మతం స్వచ్ఛత, పవి త్రతల గురించి చర్చ ఎక్కువైంది. ప్రగ తిశీల జీవన విధానాన్ని తప్పుబట్టి ఒక మతాన్ని, కులాన్ని కించపరిచే చర్యలు ఎక్కువవుతున్నాయి.

ఆచార్యదేవా ఏమంటివే మంటివి ?
జాతి నెపమున సూత సుతునకిందు
నిలువ అర్హత లేదందువా
ఎంత మాట, ఎంత మాట
ఇది క్షాత్ర పరీక్ష కానీ
క్షత్రియ పరీక్ష కాదే…
ఈ డైలాగులు తెలుగు ప్రజలకు ప్రత్యేకించి సాహిత్యాభిలాషులకు సుపరిచితమే. ఈ డైలాగుల సారం, సారాంశం కూడా అందరికీ తెలిసినదే.
ఇది పురాణం. కాని ఒక సంఘటన, సందర్భం మనకు ఇది వివరించగలదు. కౌరవులు, పాండవులు తమ అస్త్ర, శస్త్ర విద్య విన్యాసములను ప్రదర్శిసుండగా అక్కడే ఉన్న ఒక యువకుడు కర్ణుడు. కులాన సూతుడు. ఆ అస్త్ర, శస్త్ర పోటీలో పాల్గొనడానికి అనుమతిని అడగగా, కౌరవ, పాండవుల గురువు ద్రోణాచార్యుడు అభ్యంతరం తెలిపిన సందర్భంగా యువరాజు సుయోధనుడు తన ప్రతిఘటనను తెలియజేసిన సందర్భమిది. ఆ రోజుల్లోనే కులంపైన తన ధిక్కార స్వరం వినిపించిన గొప్ప ధీరోధాత్తుడు. అదే భారత దేశంలో కులం స్వచ్ఛతను, పవిత్రతను ప్రశ్నించి, ఈ కులాలన్ని ఏనాడో కలగలిసిపోయాయని, కులం తనకు తాను దడి గట్టుకొని లేదని, అవసరాల రీత్యా అందరూ ఒకరితో ఒకరు కలిసి పోయారని, అందువల్ల కులం, కులం అని కేకలు వేయడం వృథా ప్రయాస అని తన నిరసనను సుయోధనుడు వ్యక్తపరిచాడు. ఆ తర్వాత అనేక మంది ఇదే విషయాన్ని తమ అధ్యయనాలు, పరిశోధనల ద్వారా రుజువు చేశారు.
ప్రస్తుతం ఈ పురాణం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఇటువంటి చర్చే మళ్లీ మొదలైంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లు దీనిని లేవనెత్తారు. పేర్లు ప్రస్తావించడం అనవసరం. ఎందుకంటే, వ్యక్తులు ముఖ్యం కాదు. వాళ్ళు ప్రస్తావించిన అంశం మనం చూడాలి. ఒక నాయకుడు పేరు ప్రస్తావించి ఆయనదే కులం, ఏ మతం అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బహిరంగంగానే ఈ ప్రశ్నను వేశారు. ఆయన హిందువు కాదని, ఆయన తండ్రి పార్సి ముస్లిం అయినందు వల్ల ఆయన ముస్లిం అవుతారని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దానికి జవాబుగా, కాంగ్రెస్ నాయకులు మరొక చివరికి వెళ్లి రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అని వాదించారు. రాహుల్ గాంధీ వంశం గురించి మాట్లాడితే లేదా ఆయన తల్లిదండ్రులు, తాతనాయనమ్మలు గురించి చెబితే ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఎందుకంటే కులం, మతం పట్టింపులు లేకుండా వాళ్లు తమ జీవితాలను పంచుకున్నారని కొనియాడేవాళ్లు. రాజీవ్ గాంధీ క్రిస్టియన్ అయిన సోనియా గాంధీని, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా క్రిస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. ఇది భారత దేశంలో ఒక మార్గదర్శకమైన జీవన విధానం అభినందించాల్సిందే. అయితే ఇటీవల రాజకీయ ప్రయోజనాల రీత్యా కులం, మతం స్వచ్ఛత, పవిత్రతల గురించి చర్చ ఎక్కువైంది. ప్రగతిశీల జీవన విధానాన్ని తప్పుబట్టి ఒక మతాన్ని, కులాన్ని కించపరిచే చర్యలు ఎక్కువవుతున్నాయి.
గతంలో చాలా మంది జాతీయ స్థాయి నాయకులు, మేధావులు, రచయితలు, కళాకారులు తమ తమ మతాలతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటేనని, అంతేకాకుండా మనమంతా విశ్వ నరులమని ప్రకటించుకున్నారు. కాని ఇటీవల రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఒక హోదాను, స్థాయిని సూచించడం లేదు. రాహుల్ గాంధీ కులం భారతీయత, మతం సోదరత్వం అంటే తప్పేమీ కాదు. అయితే నాయకులు వాళ్ల వాళ్ల పుట్టుకల మీద, వంశ చరిత్రల మీద కంటే వారి విధానాలను, రాజకీయాలను విమర్శిస్తే బాగుంటుంది. అంతేకాని పుట్టుకల మీద చర్చ చేస్తే అది చవకబారు తనమే అవుతుంది. మనం భారతీయులం. భరతుడు పరిపాలించాడు కాబట్టే మనది భారత దేశం అయిందని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. ఇది నిజం కాదు. అది వేరే సందర్భంగా మనం చర్చించుకోవచ్చు. ఇప్పటి వరకు మనం భరతుని వారసులమని ప్రకటించుకుంటున్నాం. అంటే మన మూల పురుషుడు భరతుడు. ఆయన పుట్టుక ఏమిటి?
ఇది కూడా మనందరకు తెలిసిందే. రాజర్షి విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు, కర్మేణ బ్రాహ్మణుడు, దేవ వేశ్య మేనకకు పుట్టిన ఆడబిడ్డ శకుంతల. క్షత్రియుడైన దుశ్యంతుడు, శకుంతలకు జన్మించిన వాడు భరతుడు. ఇప్పుడు భరతుడిది ఏ కులం. ఆ పరంపరలో వచ్చిన మనందరిది ఏ కులం?
దీనికి కొనసాగింపుగానే ఇటీవల జన్యుపరమైన పరిశోధనల్లో ఇవే విషయాలు వెల్లడయ్యాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, మన హైదరాబాద్‌లోని సిసిఎంబి సంస్థలు, జన్యుపరమైన పరీక్షల ద్వారా కులం చరిత్రను వివిధ ప్రజల్లో ఉన్న జన్యువులను పరీక్షించారు. అండమాన్, నికోబార్‌లోని ఆదివాసులలో మినహా మిగతా వారందరిలో పెద్దగా తేడాలు లేవని తేల్చారు. ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజల మధ్య కొన్ని తేడాలున్నట్లు గమనించారు. కాని కులాల మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవని గమనించారు. అంతేకాకుండా భారతదేశంలోని కులాలు అన్ని ఒక దానినొకటి కలిసిపోయాయని తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం మీద యురేసియా ప్రభావం ఉంటే, దక్షిణ భారత దేశం మీద దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రజల జన్యువులతో కలుస్తున్నాయని తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. సరిగ్గా ఇదే విషయాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ తన పరిశీలన ద్వారా కూడా తెలియజేశారు.
ఉత్తర భారతదేశంలోని బ్రాహ్మణులు, దక్షిణ భారత దేశంలోని బ్రాహ్మణులు ఒకే రకంగా లేరని, అదే విధంగా ఉత్తర భారతదేశంలోని బ్రాహ్మణులు ఇతర కులాలు, అదే విధంగా దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణులు ఇతర కులాల మధ్య పెద్ద గా తేడాలు లేవని ఆయన తన మానవ పరిశోధనలో తేల్చారు. అటు చరిత్ర, ఇటు శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలు కులానికి కులానికి మధ్య ఏదో తేడా ఉందని, తమ కులం తమకు పరిశుద్ధమైనదని, మిగతా కులాలన్నీ సంకరమైపోయాయని ప్రకటించడం పూర్తిగా హేతు విరుద్ధం. ఇంకొక విషయం ఒక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కులాల పేర్లు చాలా మట్టుకు వంద ఏళ్ల కిందటనే మనకు కనిపించవు. ఒకప్పుడు ఒక కులంగా ఉన్న సమూహం నేడు ఎన్నో కులాలుగా విభజనకు గురయ్యాయి. నిజానికి మనుషులంతా ఒక తెగ నుంచి, ఒక సమూహం నుంచే వచ్చారు.
సాధారణ మనిషి భాషలో చెప్పాలంటే అందరిది ఒకే వంశరక్తం. తేడాలు లేవు. మతాలు, కులాలు మన అవసరాలకు తగ్గట్టుగా సృష్టించుకున్నాం. అయితే అవి ఒకరినొకరు అవమానించుకోవడానికి, హింసించుకోవడానికి, ధ్వంసించుకోవడానికి సాధనాలు కాకూడదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ తన కుల నిర్మూలన ప్రతిపాదనలో కులాంతర వివాహాలు ఒకటి. అయితే ఇటీవల కొంత మంది యువతి, యువకులు కులాలకు, మతాలకు అతీతంగా ఒక్కటవుతున్నారు. కాని ఇటువంటి పెద్దల మాటలతో తమ కులం గొప్పదని, తమ మతం గొప్పదని దాడులు, హత్యలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలను ఈ నేతలు ఎట్లాగు ఖండించడం లేదు. కాని అటువంటి వివాహాలు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకుల కుటుంబాలను అవమానించడం సరియైన పద్ధతి కాదు. ప్రశంసించకపోయినా ఫర్వాలేదు. కాని అవహేళన చేయడం మంచిది కాదు.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News