Friday, December 20, 2024

ఆదాయానికి మించిన ఆస్తులు.. ఎసిసి ఉమామహేశ్వరరావు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిసి ఉమామహేశ్వరరావు అరెస్ట్
రూ.3 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం
17 చోట్ల స్థిర, చరాస్తులు, రెండు లాకర్లు గుర్తింపు
ఘట్‌కేసర్‌లో ఐదు ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఎసిపి ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఎసిపి ఉమామహేశ్వరరావుని కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఆయనపై ఆరోపణలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ఈ మేరకు మంగళవారం ఎసిబి అధికారులు మంగళవారం ఉదయం నుంచి అశోక్‌నగర్‌లోని ఆయన ఇంటితో పాటు 14 చోట్ల సోదాలు నిర్వహించారు.

ఇప్పటిదాకా జరిపిన సోదాల్లో ఎపిపికి సంబంధించిన 17 చోట్ల స్థిర, చరాస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట మార్కెట్ ప్రకారం దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఘట్‌కేసర్‌లో ఐదు ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశారు. రెండు లాకర్లను ఎసిబి అధికారులు గుర్తించారు.

ఉమామహేశ్వరరావు గతంలో ఇబ్రహీంపట్నం ఎసిపిగా పనిచేశారు. ఆ సమయంలో అక్రమా ర్జనకు పాల్పడి భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఇప్పుడు సిసిఎస్‌లోనూ ఆయన పలు కేసుల్లో లంచాలు స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎసిపి ఉమామహేశ్వరరావు నివాసంలో ఎసిబి సోదాలు అంటూ మీడియాలో రావడంతో బాధితులు ఆయన నివాసం వద్దకు చేరు కున్నారు. ఎసిపి ఉమామహేశ్వరరావు బాధితులకు అండగా నిలవకుండా, నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారని వారు ఎసిబి అధికారులకు వివరించారు. మరోవైపు ఉమామహేశ్వ రరావు డైరీలో కొన్ని పేర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో సందీప్ అనే పేరు రాసి ఉందన్నారు. ఉమామహేశ్వ రరావు, సందీప్ కలిసి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

సందీప్ పాత్ర పై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. సిసిఎస్‌లో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో బాధితుల దగ్గర నుంచే ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా గతంలో ఇబ్రహీం పట్నం ఎసిపిగా ఉన్న సమయంలో ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు, సాహితీ ఇన్‌ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాదితులకు అన్యాయం చేశాడని పలువురు ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News