Saturday, November 23, 2024

సిసిఎస్ ఎసిపి ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఎసిపి టి.ఎస్.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన ఎసిబి అధికారులు బుధవారం కోర్టులో హాజరు పర్చారు. ఎసిబి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధింబచడంతో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఎసిపి ఇంటికి చేరుకున్న ఎసిబి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు ఆగడాల గురించి ఎసిబి అధికారులకు ఫిర్యాదులు అందాయి. పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. బాధితులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. ఫిర్యాదులన్నీ పరిశీలించిన తర్వాత ఎసిబి అధికారులు సోదాలు చేశారు.

3 కోట్ల 45లక్షల ప్రాపర్టీని సీజ్ చేశారు. ఆయన అత్తగారి ఇంట్లో 38లక్షల నగదు గుర్తించారు. ఆయన ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ప్రాపర్టీస్ సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 40 కోట్లకు పైనే ఉంటుందని ఎసిబి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోసారి ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. ఉమమహేశ్వర రావు ఇంట్లో దొరికిన ట్యాబ్‌లో ఆయన లావాదేవీలు, ఎక్కడెక్కడ బిజినెస్ చేశారు? ఎక్కడెక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేశారు? ఈ డిటైల్స్ మొత్తం తెలిసే అవకాశం ఉందన్నారు. ఇక ఒక డైరీలో ఉమామహేశ్వరరావు కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఆ వ్యక్తులు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. అలాగే ఎవరెవరిని బెదిరించారు? ఎంత వసూలు చేశారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News