Thursday, January 9, 2025

ఎసిబికి చిక్కిన సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు సిసిఎస్ ఇన్స్‌స్పెక్టర్‌ను గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓల్డ్ బోయినపల్లికి చెందిన మని రంగస్వామిపై సిసిఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసును సిసిఎస్‌లోని ఈఓడబ్లూ టీమ్ 7లో ఉన్న ఇన్స్‌స్పెక్టర్ చామకూరి సుధాకర్ దర్యాప్తు చేస్తున్నాడు. దీంతో రంగస్వామి ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్‌ను కలిశాడు. కేసులో ఫేవర్ చేయాలంటే రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి రూ.5లక్షలకు ఒప్పందం కుదిరింది. తర్వాత ఈ విషయం రంగస్వామి ఎసిబి అధికారులకు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు రంగస్వామి ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్‌కు రూ.3లక్షలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News