- Advertisement -
ఆర్టీసి చైర్మన్ లేఖ రాసిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నాయకులు
హైదరాబాద్: సిసిఎస్‌కు చెల్లించాల్సిన అసలు, వడ్డీ బకాయిలు రూ.1,049 కోట్లు ఇవ్వాలని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు సిసిఎస్ (క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ) మేనేజింగ్ కమిటీ నాయకులు యాదగిరి, లక్ష్మయ్యలు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. నాలుగేళ్లు ప్రతి ఆర్టీసి కార్మికుడి జీతం నుంచి 7 శాతం సిసిఎస్ అమౌంట్ కట్ చేసి ఆర్టీసి ఉపయోగించుకుంటుందని, వాటిని సిసిఎస్‌కు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిసి రూ.1,049 కోట్లకు చేరాయని ఆ లేఖలో నాయకులు తెలిపారు. రెండేళ్లుగా కార్మి కులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, ఏడు వేల లోన్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం, ఆస్పత్రుల ఖర్చుల కోసం కార్మికులు అప్పులు చేస్తున్నారని వారు తెలిపారు. వెంటనే సిసిఎస్ బకాయిలను చెల్లించాలని వారు ఆ లేఖలో సూచించారు.
- Advertisement -