Sunday, December 22, 2024

డిజినల్ ఇండియా సిఈఓ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

పేజీల స్కానింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు
బాధితుల నుంచి డిపాజిట్లు తీసుకున్న నిందితుడు
ఇంటి వద్ద ఉండే నెలకు రూ.50వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు
రూ.15కోట్లు వసూలు చేసి పరార్
వివరాలు వెల్లడించిని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు భూపాల్

హైదరాబాద్: పాత పుస్తకాల పేజీల స్కానింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పారిపోయిన డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు గతంలో ముగ్గురు డైరెక్టర్లను అరెస్టు చేయగా, అప్పటి నుంచి సిఈఓ పరారీలో ఉన్నాడు. సిసిఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజారావు భూపాల్ పాత పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘజియాబాద్‌కు చెందిన దీపక్ శర్మ నార్త్‌ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. పాతపుస్తకాలను పిడిఎఫ్ పేరుతో డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాడు. దీనిలో డైరెక్టర్లుగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సయ్యద్ సమీర్ ఉద్దిన్, ఆశిష్‌కుమార్ అలియాస్ ఆశిష్, అమిత్ శర్మ ఉన్నారు. డిజినల్ ఇండియా కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. ఇంటి వద్ద ఉంటూ ప్రతి నెల 10,000 పేజీల పాత నవలలు, పాత పుస్తకాలను పిడిఎఫ్ చేస్తే నెలకు రూ.50,000 సంపాదించవచ్చని పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు, మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించాడు.

ఇందుకు గాను ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పాడు. దీంతో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న వారు పెద్ద ఎత్తున నిందితుడి ఆఫీస్‌కు వెళ్లి, నగదు, బ్యాంక్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇలా 620మంది బాధితులు రూ.15 కోట్ల వరకు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని బాధితులకు స్కానర్, పదివేల పేజీలు ఉన్న పాత నవల పేజీలు ఇచ్చి నెలలో స్కానింగ్ చేసి ఇవ్వాలని చెప్పాడు. ఇలా చేసిన వారికి మూడు, నాలుగు నెలలు రూ.50వేల చొప్పున ఇచ్చాడు.

నెల నెలకు డబ్బులు ఇవ్వడంతో బాధితులు తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని ఇందులో చేర్పించడం ప్రారంభించాడు. దీంతో నిందితుడు కాషన్ డిపాజిట్‌ను రూ.5లక్షలకు పెంచి జూలై,2022 వరకు డబ్బులు తీసుకుని ఇక్కడ ఉన్న ఆఫీస్‌ను మూసివేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు డైరెక్టర్లను గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండడంతో వెతుకుతుండగా ఆచూకీ లభించడంతో అరెస్టు చేశారు. కేసును ఎసిపి హరికృష్ణ తదితరలు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News