Wednesday, January 22, 2025

మల్కాజ్గిరి సిసిఎస్ ఎస్ఐపై రేప్ కేసు

- Advertisement -
- Advertisement -

CCS SI Vijay was suspended by Rachakonda CP Mahesh Bhagwat

హైదరాబాద్‌: మల్కాజ్గిరి సిసిఎస్ ఎస్ఐ ధరావత్‌ విజయ్పై రేప్ కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనతో కొంతకాలం సహజీవనం చేసి, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని అందులో పేర్కొన్నది. తనను వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని వాపోయింది. ఇంతకు ముందే పెండ్లయిన విషయాన్ని దాచిపెట్టాడని, కొంతకాలంపాటు హైదరాబాద్‌లో ఇద్దరం కలిసే ఉన్నామని వెల్లడించింది. యువతి ఫిర్యాదుతో ఎస్ఐ విజయ్ను రాచకొండ సీపీ మహేష్భగవత్ సస్పెండ్ చేశారు. కేసుపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News