Monday, December 23, 2024

విద్యార్థినుల టాయిలెట్లలో సిసి కెమెరాలు..

- Advertisement -
- Advertisement -

పుణె : విద్యార్థినుల మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు అమర్చడమే కాకుండా అన్యమత ప్రార్థనలు చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న ప్రిన్సిపాల్‌కు భజరంగ్‌దళ్ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఆ తరువాత పోలీస్‌లకు అప్పగించారు. పుణె లోని తలెగావ్ దాబాడే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అంబి గ్రామం లోని డీవై పాటిల్ హైస్కూల్‌లో ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ కోట్స్ చేస్తున్న ఈ వికృత చేష్టలకు విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు.

దీంతో తల్లిదండ్రులు భజరంగ్‌దళ్ సభ్యులకు ఈ విషయం తెలియజేశారు. మంగళవారం భజరంగ్‌దళ్ సభ్యులు వచ్చి ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేసి పోలీస్‌లకు అప్పగించారు. ఆ తరువాత తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా పోలీస్‌లు ఫిర్యాదు స్వీకరించారు. విద్యార్థినుల మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వాస్తవమేనని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News