Monday, January 27, 2025

లాల్‌దర్వాజా సింహవాహిణి పాటల సిడి ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: తెలంగాణలోనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయం 115వ వా ర్షిక బోనాల ఉత్సవాల పాటల సీడీనీ ఆదివారం ఆలయ వేదికపై అర్చకులు కార్తికేయ శర్మ, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ భోజ్యానాయక్‌లతో కలిసి చైర్మన్ రా జేందర్ యాదవ్ ఆవిష్కరించారు. బోనాల ఉత్సవాలను నిర్వాహకులు ఐక్యమత్యంగా ఘనంగా జరుపుకోవాలని ఇన్‌స్పెక్టర్ భోజ్య ఆకాక్షించారు.

అమ్మవారి చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ పాటల సీడీని రూపొందించటం అభినందనీయమన్నారు. ఉత్సవాలకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ పుట్టిన రోజును కేక్‌కోసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ లయ ప్రధాన కార్యదర్శి బి.మారుతీయాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్, మాజీ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News