Friday, November 15, 2024

అమెరికన్ల ముఖాలకు పాత కళ

- Advertisement -
- Advertisement -

CDC says fully vaccinated people can outdoors without Mask

 

న్యూయార్క్ : అమెరికాలో జనానికి ఇక మాస్క్ బెడద తప్పింది. పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌లు వేసుకున్న వారు ఇకపై బయటికి వెళ్లేటప్పుడు మాస్క్‌లు వేసుకోవల్సిన అవసరం లేదు. ఈ మేరకు దేశంలోని అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసి) తాజా మార్గదర్శకాలలో తెలిపింది. కొవిడ్ నిబంధనలనేకం సరళీకృతం చేస్తూ ఈ మార్గదర్శకాలు వెలువడ్డాయి. అయితే జన సమూహం ఎక్కువగా ఉండి, అపరిచితులు ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్‌లు వేసుకుంటే మంచిదని స్పష్టం చేశారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్‌లు వేసుకోని వారు కూడా మాస్క్‌లు లేకుండా బయట తిరగవచ్చునని తెలిపారు. కరోనాకు అత్యంత ప్రధానమైన రక్షణ వ్యవస్థలో భాగంగా మాస్క్‌ల ధారణ ఒకటిగా మారింది. రెండో కీలక అంశంగా భౌతికదూరం పాటించడం నిబంధన ఉంది.

మాస్క్‌ల ధారణ చివరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రధాన అంశం అయింది. మాస్క్‌లు అవసరం లేదని వాదించిన ట్రంప్‌ను ఏవగించుకుని పలువురు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి, ఇంటిదారి పట్టించారు. అమెరికాను కరోనా వైరస్ తీవ్రస్థాయిలోనే ఆడిపోసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 5,70,000 మంది ఈ వైరస్‌కు బలి అయ్యారు. కోట్లాది మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం దేశం కరోనా వ్యాక్సినేషన్ల దశలో లక్షసాధనలో ఉంది. ఈ దశలోనే ఇప్పుడు వెలువరించిన నూతన మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో విశ్లేషించుకుని రూపొందించినవిగా భావిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలు విముక్తి పొంది, సాధారణ జీవితాల దశను తిరిగి అందుకున్నారని చెప్పేలా ఈ గైడ్‌లైన్స్ ఉన్నాయని స్పష్టం అవుతోంది. భౌతిక దూరాలు పాటించినా అమెరికన్లు అంతా ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా మాస్క్‌లు వేసుకుని తీరాలని సిడిసి పదే పదే గత ఏడాది హెచ్చరికలు వెలువరిస్తూ వచ్చింది.

ఇంతకు ముందటి పరిస్థితి ఏర్పడిందని చెప్పడానికి అవకాశం కల్పించే చర్యకు దిగుతున్నామని సిడిసి డైరెక్టర్ డాక్టర్ రొచెల్లి వాలెన్‌స్కి తెలిపారు. వ్యాక్సిన్లు వేసుకున్న వారు మాస్క్‌లను తీసివేయవచ్చు. ఈ విషయం ఈ మార్గదర్శకాలతో తెలియచేస్తున్నానని వివరించారు. దేశంలో వయోజనులలో సగం మంది ఇప్పటికే ఓ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. మొత్తం జనాభాలో మూడోవంతుకు వ్యాక్సిన్ అందింది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు అవసరం లేదనే నిర్ణయాన్ని గైడ్‌లైన్స్‌లో పొందుపర్చారు. గైడ్‌లైన్స్‌లో మార్పులను అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ మైక్ సాగ్ స్వాగతించారు. ఇది నిజంగానే మనకు తిరిగి స్వేచ్ఛ దక్కిన రోజు అవుతుందని అలబామా వర్శిటీలో నిపుణులు అయిన సాగ్ స్పందించారు. కరోనా నుంచి పూర్తిగా నిష్క్రమించలేదు. అయితే ఇప్పటి స్థితిని బట్టి చూస్తే మనం నిష్క్రమణ దారిలో ఉన్నామన్నారు. ఇంతకంటే మంచి రమణీయ ఘట్టం మరోటి ఉంటుందా? అని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News