Wednesday, January 22, 2025

అమర వీరులకు సిడిఎస్, ఆర్మీ చీఫ్ నివాళులు

- Advertisement -
- Advertisement -

శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : 78వ శౌర్య దివస్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఒక కార్యక్రమంలో రక్షణ దళాధిపతి (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్, సైనిక దళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది విధి నిర్వహణలో అమరులైన పదాతిదళ సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్టోబర్ 27వ తేదీ పదాతిదళానికి విశిష్టమైనదని, 1947లో ఇదే రోజు పదాతిదళ సిబ్బంది భారత సైన్యం నుంచి శ్రీనగర్‌లో కాలు మోపిన మొదటి సైనికులని, నగర శివార్ల నుంచి దురాక్రమణదారులను ఖాళీ చేయించారని, ఆవిధంగా పాకిస్తాన్ దురాక్రమణ నుంచి జమ్మూ కాశ్మీర్‌ను కాపాడారని ఆర్మీ తెలియజేసింది.

శౌర్య దివస్ కార్యక్రమంలో జనరల్ చౌహాన్, జనరల్ ద్వివేది పదాతిదళ సిబ్బందికి నివాళులు అర్పించేందుకు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు ఉంచారు. భారత సైన్యంలో అతిపెద్ద సమర విభాగం పదాతిదళం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆదివారం ఈ సందర్భంగా ‘ఎక్స్’లో అమరవీరులకు నివాళులు అర్పించారు. ‘పదాతిదళ దినం సందర్భంగా అవిశ్రాంతంగా మనల్ని కాపాడుతుండే పదాతిదళంలోని అన్ని హోదాల సిబ్బంది, వెటరన్ల తిరుగులేని స్ఫూర్తికి, సాహసానికి మనం అంతా సలామ్ చేస్తున్నాం. వారు సదా ఏ ప్రతికూల పరిస్థితిలోనైనా దృఢచిత్తంతో ఉంటూ, మన దేశం భద్రతను, రక్షణను సాధ్యం చేస్తున్నారు. పదాతిదళం బలానికి, శక్తికి, కర్తవ్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి భారతీయునికి స్ఫూర్తి కలిగిస్తోంది’ అని మోడీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పదాతిదళంలోని అన్ని విభాగాల కల్నల్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News