Tuesday, January 21, 2025

బిఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

గులాబీ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..‘భారత్ రాష్ట్ర సమితి‘ గా ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సిఎం కెసిఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన ‘భారత రాష్ట్ర సమితి‘ ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో (ఒంటిగంట 20 నిమిషాలకు) తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం సిఎం బిఆర్‌ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల రెతుబంధు సమితి అధ్యక్షులను, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ మధ్యాహ్నంలోగా తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సిఎం కెసిఆర్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News