Wednesday, January 22, 2025

నేడు కశ్మీరుకు సిఇసి రాక.. రాజకీయ పార్టీలతో భేటీ

- Advertisement -
- Advertisement -

శ్రీగనర్: జమ్మూ కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర పాలిత ప్రాంతంలోని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ గురువారం సమావేశం కానున్నది. ఎన్నికల కమిషన్‌తో సమావేశం కోసం జమ్మూ కశ్మీరుకు చెందిన ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మంగళవారం వివిధ రాజకీయ పార్టీలకు నోటీసులు పంపింది. ఎన్నికల కమిషన్‌తో విడివిడిగా సమావేశం అయ్యేందుకు రాజకీయ పార్టీలకు టైమ్ స్లాట్లను కేటాయించింది.

జమ్మూ కశ్మీరులో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కోసం సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సివిసి) రాజీవ్ కుమార్ ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీరులోనే మకాం వేయనున్నారు. రాజీవ్ కుమార్ వెంట ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్‌ఎస్ సంధూ కూడా యుటికి రానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News