Thursday, January 23, 2025

శాంతియుతంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ముస్లిం సోదరులు శాంతియుతంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. బక్రీద్ వేడుకల సం దర్భంగా నేరెడ్‌మెట్‌లోని సిపి ఆఫీస్‌లో శుక్రవారం డిసిపిలు,ఎసిపిలు, జిహెచ్‌ఎంసి, వెటర్నరీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కమిషనరేట్‌లో మతసామరస్యం కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనరేట్‌లో చాలా సున్నిత ప్రాం తాలు ఉన్నాయని తెలిపారు.

బక్రీద్ వేడుకల సమయంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరించాలని అన్నారు. ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కమిషనరేట్ పరిధిలో 12 చెక్‌పోస్టులు, 6 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సిసిటివిలను పరిశీలించాలని అన్నారు.

ట్రాఫిక్ జాంలు ఏర్పడకుండా చూడాలని, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేడుకలు ముగిసే వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎప్ప టికప్పుడు ఉన్నతాధికారుల నుంచి సలహాలు, సూలచలు తీసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News