Monday, December 23, 2024

వండర్ లా పార్క్స్‌కి ఉచిత టిక్కెట్‌..

- Advertisement -
- Advertisement -

దేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్‌లతో మాన్‌సూన్‌ను వేడుక చేస్తుంది. వండర్ లా తమ సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకువచ్చింది. తమ పుట్టినరోజులు జరుపుకునే వ్యక్తులు తమ పుట్టినరోజుకు 5 రోజుల ముందు లేదా 5 రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా వండర్ లాకి “ఉచిత పార్క్ ఎంట్రీ టిక్కెట్”ని పొందవచ్చు. ఈ ఆఫర్ వండర్ లా యొక్క బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి లోని మూడు పార్కులకు వర్తిస్తుంది.

అతిథిలు తమ పుట్టినరోజున వండర్ లా యొక్క ఉల్లాసకరమైన రైడ్‌లు, ఆకర్షణల యొక్క థ్రిల్‌ను పొందవచ్చు, అదనపు ప్రోత్సాహకాలతో ఆనందించవచ్చు! వీటితో పాటు పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్ డే జోన్‌ వద్ద కేక్ కటింగ్ వేడుకలు, ప్రియమైన వారితో సంతోషాలను పంచుకున్నప్పుడు అవి మరింతగా గుర్తుండిపోతాయి.

ఇక్కడితో అయి పోలేదు, రుతుపవనాలు వచ్చాయి కాబట్టి, అద్భుతమైన వర్షంలో తడుస్తూ సాహసం చేయాలనుకునే వారికి వండర్ లా అనువైన ప్రదేశంగా నిలుస్తుంది! వారాంతాల్లో ఓపెన్-ఎయిర్ రెయిన్ డ్యాన్స్ ఆనందాన్ని అనుభవిస్తూనే ధోల్/DJ బీట్‌లకు లీనం కావొచ్చు. ఈ మాన్ సూన్ వేడుకల్లో భాగంగా రుచికరమైన విందులతో మీ టేస్ట్ బడ్స్ కు సంతోషం కలిగించే రీతిలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ రుచులను ఆస్వాదిస్తూనే బెంగుళూరు, హైదరాబాద్ పార్కులలో లభ్యమయ్యే వెచ్చని నీటి కొలనులలో సేదతీరవచ్చు. మీ వీక్ డేస్ కు మరింత ఉత్సాహాన్ని జోడించడానికి, వండర్ లా బుధవారం ఆన్‌లైన్ టిక్కెట్ కొనుగోళ్ల పై ప్రత్యేకంగా ఫ్లాట్ 25% తగ్గింపు అందిస్తూ వెడ్నెస్ డే ఆఫర్‌ను పరిచయం చేసింది. ఈ ఆఫర్ ఆగస్టు 23 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ కార్యక్రమం గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ..”మా థ్రిల్లింగ్ ట్రైఫెక్టా ఆఫర్‌లతో వండర్ లా అద్భుతాన్ని కనుగొనండి! ఉచిత టిక్కెట్‌తో మీ పుట్టినరోజును స్టైల్‌గా జరుపుకోండి, ఓపెన్ ఎయిర్ రెయిన్ డాన్స్ తో మాన్సూన్ బీట్‌లకు వూగిపోండి, 25% తగ్గింపుతో బుధవారాలను మర్చిపోలేనివిగా మార్చుకోండి. వండర్ లా లో చిరస్మరణీయమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు!” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News