Thursday, January 23, 2025

బాదముల చక్కదనంతో రంగుల పండుగ హోలీని వేడుక చేసుకోండి..

- Advertisement -
- Advertisement -

వసంతకాలం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కూడా అత్యంత ఆనందకరమైన వేడుక– రంగుల పండుగ– హోలీ కోసం సిద్ధమవుతున్నారు!. శీతాకాలం పోయి వసంత కాలపు ఆరంభానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుతుంటారు. ఈ పండుగ పూర్తి ఆనందోత్సాహాలతో వస్తుంది. ఒకరినొకరు రంగులలో ముంచుత్తుకుంటూ, జీవితంలో రంగులను ఆస్వాదించమని చెప్పే సమయమిది. ఫ్యామిలీ సమావేశాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు, పసందైన రుచుల ఆస్వాదన కనిపిస్తుంటుంది!. మనం హోలీని కేవలం రంగులతో మాత్రమే వేడుక చేయడం మాత్రమే కాకుండా మన ప్లేట్లలో కూడా విభిన్న రంగుల ఆహారం తీసుకుంటుంటాము. నోరూరించే వంటకాలెన్నో ఈ రోజు సిద్ధం చేశారు. అయితే, ఇక్కడ విషాదమేమిటంటే, ఈ రుచుల ఆస్వాదనలో ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తింటుండటం. దీని కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ సంవత్సరం, నూతన ప్రారంభాన్ని వేడుక చేస్తూ, ఆరోగ్యవంతమైన హోలీ కోసం ప్రణాళిక చేయండి. పండుగ సమమాలలో మనం ఏం తింటున్నామనే దానిపై ఆప్రమప్తంగా ఉండటంతో పాటుగా బాదములతో స్నాక్స్‌ తయారుచేసుకుని తినవచ్చు. బాదములు ఆరోగ్యవంతమైనవి మరియు పోషకాలతో కూడినవి. హోలీ వేడుకలలో వీటిని భాగం చేయవచ్చు. అంతేకాదు, స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో పంచుకోవచ్చు. సంప్రదాయ రెసిపీలు లేదా స్నాక్స్‌తో కూడా వీటిని వేడుకలలో భాగంగా అందించవచ్చు. బాదములు ఆరోగ్యపరంగా ఉత్తమమైనవి. వీటిలో విటమిన్‌ఈ, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌ , మాంగనీస్‌, ఫోలేట్‌ తదితర 15కు పైగా పోషకాలు ఉంటాయి. సంవత్సరాల తరబడి చేసిన శాస్త్రీయ అధ్యయనాలు వెల్లండించే దాని ప్రకారం క్రమం తప్పకుండా బాదములు తింటే గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహం, బరువు నియంత్రించబడటం జరుగుతుంది.

బాదముల వల్ల కలిగే చర్మ ఆరోగ్య ప్రయోజనాలను గురించి మెడికల్‌ డైరెక్టర్‌ మరియు కాస్మెటాలజిస్ట్‌, డాక్టర్‌ గీతిక మిట్టల్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ మీరు ఓ చక్కటి స్కిన్‌కేర్‌ ప్రక్రియను అనుసరిస్తుంటే మాత్రం హోలీ మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. హోలీ ఆడేటప్పుడు వాడే రంగులు మీ చర్మంకు నష్టాన్ని చేయగలవు. దీనివల్ల మీ స్కిన్‌కేర్‌ రోటీన్‌లో కొద్ది పాటి మార్పులను చేసుకోవడం ద్వారా మీ చర్మం ఆరోగ్యంగా,ప్రకాశవంతంగామారుతుంది. మీరు సహజసిద్ధంగానే మీ చర్మం ను బాదములు లాంటి ఆహారాన్ని ప్రతి రోజూ తినడం ద్వారా కాపాడుకోవచ్చు.

బాదములలో విటమిన్‌ ఈ, రాగి, జింక్‌, పాలీఫెనాల్స్‌ వంటివి ఉంటాయి. దీని కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేద, సిద్ధ, యునాని సాహిత్యం ప్రకారం, బాదములు వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అదనంగా, లినోలిక్‌ యాసిడ్‌, అత్యవసర ఫ్యాటీ యాసిడ్‌ వంటివి బాదములలో ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అందువల్ల మీ చర్మ ఆరోగ్యానికి, పోషణకు ఈ హోలీ వేళ ఓ రక్షిత పొరను సిద్ధం చేసుకోండి. మీరు బాదం నూనెను మీ మొహానికి, రంగులతో ఆడటానికి ముందురాసుకోండి’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘పండుగ సమయాల్లో ఆలోచనాత్మకంగా బహుమతులు మార్చుకోవడాన్ని నేను నమ్ముతుంటాను. చక్కటి ఆరోగ్యంను అందించడాన్ని మించిన బహుమతి ఏముంటుంది ! పండుగ సమయాల్లో అత్యుత్తమ బహుమతిగా బాదములు నిలుస్తాయి. విభిన్న అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములు చర్మం, గుండెకు మేలు చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయి. ఈ ప్రయోజనాలకు తోడు, ఇటీవల అధ్యయనాలలో బాదముల వల్ల బ్యూట్రైట్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా పేగుల ఆరోగ్యమూ మెరుగుపడుతుంది’’ అని అన్నారు

సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌ మరియు సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిర్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘వినోదం మరియు ఉత్సాహపూరితమైన కార్యక్రమాలతో కూడిన ఈ రంగుల పండుగ, వేడుకలలో మీరు పాల్గొనేందుకు తోడ్పడుతుంది. ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ తీసుకుంటే వేడుకలలో పాల్గొనేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది. బాదములలో ప్రోటీన్‌ సైతం అధికంగా ఉంటుంది. ఎదుగుదల, మజిల్‌మాస్‌ నిర్వహణలో అవి తోడ్పడతాయి. ఈ రుచికరమన నట్స్‌ను ఏ సమయంలో అయినా తినవచ్చు . వీటిలో ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. తరచుగా బాదములను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇటీవల విడుదలైన ఓ అధ్యయనంలో బాదములు నీరసం తగ్గించడంతో పాటుగా రికవరీ సమయంలో కండరాలు నష్టపోకుండా కాపాడబడతాయని వెల్లడైంది’’అని అన్నారు.

ప్రత్యేక హోలీ రుచుల వేళ బాదముల యొక్క చక్కదనం గురించి చెఫ్‌ సారాంశ్‌ గోయిలా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ప్రతి పండుగకూ ఓ ప్రత్యేక రుచి కనిపిస్తుంటుంది. నా అభిమాన పండుగలలో హోలీ ఒకటి. ఈ వేడుకలలో ఆహారం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంటుంది. బాదములను పండుగ రెసిపీలలో విరివిగా వాడుతుంటాము. దీనితో పండుగ రుచులకు పోషకాలు జోడించబడతాయి. బాదముల కారణంగా జంక్‌ ఫుడ్‌కు దూరం కావొచ్చు. వీటిని పండ్లు, విభిన్న రకాల వంటకాలతో కూడా చక్కగా మిళితం చేయవచ్చు’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News