Thursday, January 23, 2025

ఈ సంక్రాంతిని జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ వద్ద వేడుక చేయండి!

- Advertisement -
- Advertisement -

దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగ సంతోషం, ఉల్లాసం, సానుకూలతను ప్రజల జీవితాలకు తీసుకువస్తుందని నమ్మిక. ఈ శుభప్రదమైన పండుగను మరింత ఆనందమయంగా మారుస్తూ ఉత్సాహపూరితమైన బహుమతులను జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ వద్ద వినియోగదారులకు అందించనుంది జీస్క్వేర్‌. ఈ ఆఫర్‌ కాలంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్‌సిటీ ని సందర్శించిన వినియోగదారులు 5 కార్లు మరియు 20 బైక్‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రతి రోజూ 100 బంగారం నాణెములను సైట్‌ను సందర్శించిన సందర్శకులకు అందిస్తామనే హామీ కూడా అందిస్తున్నారు. ఇక్కడితో ముగియలేదు… ప్లాట్‌ బుక్‌ చేసిన వినియోగదారులకు హాంగ్‌కాంగ్‌, మలేషియా, సింగపూర్‌ లేదా దుబాయ్‌ లాంటి దేశాలకు ఇద్దరు వెళ్లేందుకు పూర్తిగా చెల్లించిన ట్రిప్‌ను పొందవచ్చు. ఈ విదేశీ ట్రిప్‌ వద్దనుకుంటే 40 గ్రాముల బంగారం నాణెమును కూడా ఎంచుకోవచ్చు.

వినియోగదారులు ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక బహుమతులను చీరలు, టీషర్ట్‌ల రూపంలో ప్రతి రోజూ సైట్‌ సందర్శించిన ఎడల పొందవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తే విభిన్న అనుభూతులనూ సొంతం చేసుకోవచ్చు, సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రత్యేకంగా కైట్‌ ఫెస్టివల్‌, మెహందీ, పాటరీ, బొమ్మల కొలువు వంటివి ఇక్కడ ఏర్పాటుచేశారు. వీటిని జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ సంక్రాంతి సంబరాలు శీర్షికన 11 నుంచి 22 జనవరి 2023 వరకూ జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ వద్ద హైదరాబాద్‌– విజయవాడ మార్గంలో నిర్వహిస్తున్నారు. సందర్శకులకు పసందైన విందు రుచులను అందిస్తూ ప్రత్యేకంగా ఫుడ్‌ స్టాల్స్‌ కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకూ జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీకి అపూర్వమైన స్పందన లభించింది. ఎంతోమంది ఈ ప్రతిష్టాత్మక ప్లాట్‌ ప్రాజెక్ట్‌లో సొంత ప్లాట్‌ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అధిక శాతం ప్రీ బుక్‌ అయ్యాయి.

అత్యంత అందమైన ప్రకృతి ఒడిలో ఆసియాలో అతి పెద్ద ఫిలిం స్టూడియో రామోజీఫిలింసిటీ పక్కన హైదరాబాద్‌–విజయవాడ హైవే మార్గంలో జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ ఉంది. ఔటర్‌ రింగ్‌రోడ్‌కు అత్యంత సమీపంలో ఉన్న జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ 1242 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ సిటీ గా, హెచ్‌ఎండీఏ,రెరా అనుమతించిన అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ఇది ఖ్యాతి గడించింది. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశలో భాగంగా 368 ఎకరాల ప్రీమియం విల్లా ప్లాట్‌ కమ్యూనిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే అతి పెద్ద క్లబ్‌హౌస్‌ ఈ ప్రాజెక్ట్‌లో ఉంటుంది.

జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ హౌసింగ్‌ సీఈఓ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ ‘‘ మన దేశంలో ఎక్కువ శాతం రాష్ట్రాలలో సంక్రాంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ పండుగను తెలంగాణా సంస్కృతికి అద్దంపట్టేలా మా జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ వద్ద నిర్వహించాలనుకుంటున్నాము. హైదరాబాద్‌–విజయవాడ హైవే మార్గంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను సందర్శించడంతో పాటుగా ఈ భారీ వేడుకలలో భాగం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News