Wednesday, January 22, 2025

దశాబ్దాల కల నెరవేరిన వేళ సంబరాలు

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట:దశాబ్దాల కల సిఎం కెసిఆర్ సహకారంతోనే నెరవేరిందని హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ శనివారం మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అలాగే మైసమ్మ, గంగమ్మ తల్లికి బోనం సమర్పించి, బతుకమ్మలు ఎత్తుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివచ్చి నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు దశాబ్దాల కల అని సిఎం కెసిఆర్ సహకారంతోనే ఈ కల నెరవేరింది అన్నారు. దాదాపుగా 8.23 టీఎంసీల ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు పైగా మెట్ట ప్రాంతానికి నీరు అందుతుందని ఆకాంక్షించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సహకరించిన నిర్వాసితులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి వారి త్యాగం వెలకట్టలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు లక్ష్మీ భీలునాయక్, జడ్పిటిసి భూక్యా మంగ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజిని, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు, రేగొండ సర్పంచ్ మూల నిర్మల సూర్యరెడ్డి లతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News