గద్వాల: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాల భవన్‌లో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవి ష్కరింపజేశారు. జిల్లా సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. జ్యోతి ప్రజ్వలనతో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వచౌహన్, జడ్పీ చైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కలిసి ప్రారంభించారు.
కవి సమ్మేళనంలో పాల్గొన్న 40 మంది కవులందరిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం , జ్ఞాపిక, రూ. 1,116 నగదు పారితోషకంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావానికి కవులు , కళాకారులు చేసిన కృషి పట్ల జడ్పీ చైర్మన్ ప్రశంసలు కురి పించారు.
తెలంగాణ సాధనలో కష్టపడిన కవులు, కళాకారులను సన్మానించుకునే రీతిలో ముఖ్యమంత్రి చ ంద్రశేఖర్ రావు సముచిత స్థానం కల్పించి ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవ త్సరాలు అయిన తర్వాత వచ్చిన అభివృద్ధ్ది ఫలాలను ప్రజలకు వివరించేందుకు 21 రోజుల పాటు దశాబ్ది వేడుకలు నిర్వహించి రోజుకు ఒక పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చే కవితలు రాసి రాష్ట్రాన్ని, జిల్లాను మరింత అభివృద్ధ్ది దిశగా నడపించాలని కోరారు.కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట 21 రోజుల పాటు ప్రతి రోజు పండుగ నిర్వహిస్తూ ప్రజలకు అభివృద్ధిని వివరిస్తున్నట్లు తెలిపారు.
రైతుల పండుగ, చెరువుల పండుగ, పరిశ్రమల ప్రగతి తదితర పండుగలను ఏర్పాటు చేసుకొని వేడుకగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాహిత్య రంగానికి చెందిన కవులు ఉత్సాహంగా రాష్ట్రం ఏర్పడేందుకు కృషి చేశారని అన్నారు. మన జిల్లాలో గడియారం రామకృష్ణశర్మ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి కవులు ప్రజలకు దారి చూపారని వారిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కవులు ఇంకా సాహితీ రంగంలో ముందుకు వెళ్లి అందరిని ప్రోత్సహించే రీతిలో కవితలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ఈడి రమేష్ బాబు, డిపిఆర్వో చెన్నమ్మ, డిఈఓ కార్యాలయ అధికారి ఇందిరా, కవులు తదితరులు పాల్గొన్నారు.