Wednesday, January 22, 2025

ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -
- Advertisement -

Celebrating KTR's birthday in grand style

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా, ఎలాంటి అట్టహాసం లేకుండా, మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు సాయం చేయడం వంటి కార్యక్రమాలతో జరిగాయి. ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా, మరోవైపు జనగామ జిల్లా, ఇంకోవైపు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా జరిగాయి. జనగామ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గం రోడ్లకు ఇరువైపులా, పల్లె ప్రకృతి వనాలలో, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో, డంపింగ్ యార్డులలో, స్మశాన వాటికలలో, ప్రభుత్వ స్థలాలలో, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లలో మొక్కలు నాటారు. అలాగే పాలకుర్తి మండలం గూడూరులో రక్తదాన శిబిరం, నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్ ఘనపూర్ లో మొక్కలు నాటారు. రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాలు, గ్రామ గ్రామాన మొక్కలు నాటారు. ఒక్క జనగామ జిల్లాలోనే 31 వేల మొక్కలు నాటారు. జనగామ జిల్లా జరిగిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడా ఆడంబరాలకు పోకుండా, కేక్ కటింగ్ తో పాటు, సేవా కార్యక్రమాలకు మాత్రమే పార్టీ శ్రేణులు క్రమ శిక్షణ తో పరిమితమయ్యాయి. అయితే, విరివిగా వేలాది మొక్కలు నాటి సీఎం కెసిఆర్ పిలుపు మేరకు హరితహరాన్ని ఘనంగా నిర్వహించారు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు కొందరు కేక్ లు కట్ చేసి, అందరికీ పంచుతూ, కేటీఆర్ జన్మదిన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కెసిఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా, పార్టీని, పదవులను నిర్వహిస్తున్నారు. కెసిఆర్, కేటీఆర్ ల నాయకత్వం మనకు అదృష్టం. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతున్నది. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నది. ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారు. రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మన పథకాలు దేశం అనుసరిస్తున్నది. ఇలాంటి గొప్ప నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, వారి కుటుంబం కలకాలం చల్లగా ఉండాలి. కాలి గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ త్వరగా కోలుకోవాలి. కేటీఆర్ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు! అభినందనలు!! మంత్రి కేటీఆర్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు! అన్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, పార్టీ శ్రేణులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News