Thursday, January 23, 2025

ఘనంగా గిరిజన సంక్షేమ దినోత్సవం వేడుకలు

- Advertisement -
- Advertisement -

కల్లూరు: దశాబ్ద్ది కాలంలో జరగని గిరిజనాభివృద్ధిని దశాబ్ది కాలంలో చేసి చూపించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ దినోత్సవం వేడుకలను కల్లూరు మండలం ఓబులరావు బంజర్ గ్రామంలో బంజారా వాసుల సమక్షంలో బంజారా సంసృ్కతిని తెలుపుతూ బంజారా మహిళలు ఆటపాటలతో ఊరంతా మామిడి తోరణాలతో కొబ్బరి ఆకులతో అలంకరించగా పండగల ఊరిలో ర్యాలీని నిర్వహిస్తూ ఘనంగా నిర్వహించారు.

లంబాడీల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల అణచివేతకు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన గిరిజనులు, ఆదివాసులు, బంజారాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలల్లో తండాల్లో నవశకం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపిడిఒ రవికుమార్, ఎస్సై రఘు, జడ్పిటిసి కట్టా అజయ్‌బాబు, ఎంపిపి బీరవల్లి రఘు, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, ఓబుల్ రావు బంజర సర్పంచ్ భూక్యా మాన్సింగ్, ముచ్చవరం సర్పంచ్ గంగావరపు వెంకటేశ్వరరావు, యజ్ఞ నారాయణపురం సర్పంచ్ రాయి సూర్యనారాయణ, భుక్యా రాము, శ్రీనివాస రాథోడ్, జరపల సురేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News