Saturday, November 23, 2024

ఘనంగా యోగా దినోవత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్‌లో 10(టి) బెటాలియన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ సదానందం గూరూజీ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిత్య జీవితంలో యోగ వల్ల కలిగే లాభాలను వివరించారు. శారీరక రుగ్మతలు, మానసిక బాధల నుంచి విముక్తి పొందానికి, క్యాన్సర్, షుగర్ వ్యాధుల నుంచి దూరం కావడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీని కోసం కావల్సిన యోగాసనాలు మనమందరం నేర్చుకోవాలన్నారు. పూర్వ కాలంలో మునులు తమ యోగా శక్తి ద్వారా దివ్య శక్తులను పొంది, శవాసనం లాంటి మహోన్నత ఆసనాలను వేసే వారన్నారు.

ఇది కేవలం యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పాఠశాల డైరెక్టర్ జావిద్ తెలిపారు. ఎన్‌సీసీ 10(టి) బెటాలియన్ వరంగల్, విజ్‌డమ్ హైస్కూల్ క్యాడెట్స్ ప్రదర్శించిన ఆసనాలు, యోగ చిత్రపటం, ఆసనాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంటు జహంగీర్, డైరెక్టర్ జావిద్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్ బెజ్జంకి ప్రభాకర్, థర్డ్ ఆఫీసర్ ఏఎన్‌ఓ ప్రశాంత్‌కుమార్, వీరభద్రయ్య, రాము, ఇలియాస్, శివరాజ్, కుమారస్వామి, రవీందర్, రియాజ్, రాజేష్, జాఫర్, సుకన్య, అరుణ, సునీత, కీర్తన, సుహాసిని, శిరీషలతోపాతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

* చెన్నారావుపేటలో.. యోగతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని సర్పంచ్ తప్పెట రమేశ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగాపురం గ్రామ శివారులో గల గోబ్రియాకుంట కట్టపైన అమృత్ సరోవర్ పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో యోగా చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతీ రోజు క్రమం తప్పకుండా యోగ చేయడం వల్ల పూర్తి ఆరోగ్యకరంగా ఉండవచ్చని యోగతో చాలా ప్రయోజనాలు ఉంటాయని అన్ని రకాల వ్యాధులను యోగతో నివారించవచ్చన్నారు. ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా యోగ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ కిషోర్, పంచాయతీ కార్యదర్శి శ్వేత, టీఏ మనోహర్, వార్డుసభ్యుడు రాములు, ఫీల్డ్ అసిస్టెంటు రమేశ్, తాడెంఎ శంకర్, వేములపల్లి మనోహర్, ఆకులపెల్లి సుధాకర్, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

* గీసుకొండలో.. యోగా డేను పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో, చెరువు కట్టలపై గ్రామస్థులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు యోగాసానాలు వేశారు. ఈ సందర్భంగా యోగాసాలపై అవగాహన కల్పించారు. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో యోగను అలవాటు చేసుకోవాలన్నారు.

* నర్సంపేటలో.. మహేశ్వరం గ్రామంలోని శివాని పబ్లిక్(గీతాంజలి గ్లోబల్) పాఠశాల ప్రాంగణం యందు ప్రధానోపాధ్యాయుడు సురేందర్ ఆధ్వర్యంలో నేషనల్ యోగా డే నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా శ్రీ గురుకులం కరస్పాండెంటు మోతె సమ్మిరెడ్డి, గీతాంజలి గ్రూప్స్ ఛైర్మన్ వేములపల్లి సుబ్బారావు, శివాని పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ కంభంపాటి ప్రతాప్, శ్రీరాం కిరణ్, దేవేందర్, రామకృష్ణ, రాహుల్, బాలాజీ, సాయి విశ్వానాథ్‌లు పాల్గొనగా విద్యార్థులచే యోగా ఉపాధ్యాయుడు గౌరోజు సదానందం పిల్లలకు శ్వాస ఉచ్వాస యోగ నాడులు, వివిధ రకాల యోగాసనాలతో పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో మోతె సమ్మిరెడ్డి, కంభంపాటి ప్రతాప్ మాట్లాడుతూ.. పిల్లలు ప్రతీ రోజు ఉదయం 30 నిమిషాలు యోగ చేయాలని, ఈ ప్రక్రియలో రక్త ప్రసరణ, శ్వాస వివిధ రకాలుగా శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News