Friday, April 4, 2025

26న రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం (26న) నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. పాత పార్లమెంట్ భవనంసంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు. ఆ భవనంలోనే రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది.

రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. సంస్కృతం, మైథిలి భాషల్లో రాజ్యాంగం ప్రతులతో పాటు ఒక స్మారక నాణాన్ని, ఒక స్టాంపును ఆ సందర్భంగా విడుదల చేయనున్నారు. రాజ్యాంగంలోని చిత్రాలకు అంకితం చేసిన ఒక బుక్‌లెట్‌తో పాటు ‘మేకింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఎ గ్లింప్స్’, ‘మేకింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్లోరీ’ అనే రెండు గ్రంథాలను కూడా ఆ రోజు ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి ముర్ముతో పాటు దేశ, విదేశాల్లోని ప్రజలు కూడా రాజ్యాంగం పీఠికను చదివి వినిపిస్తారని రిజిజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News