Sunday, December 22, 2024

నేరవేరిన వందేళ్ళ కల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పెరిక కార్పొరేషన్ ఏర్పాటు అనేది వందేళ్ల కల అని అది ఇప్పటికి నేరవేరిందని పెరిక సంఘం నాయకుడు వీరయ్య పెఱిక అన్నారు. పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం గాంధీభవన్‌లో పెరిక సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీరయ్య పెరిక మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వాన్ని పెఱిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నో సార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, ఉన్న ఒక్క ఎంఎల్‌ఎ టికెట్ కూడా గుంజుకున్నారని విమర్శించారు. మా ఉసురు తాకి ఓటమి పాలయ్యారని అన్నారు. మా వినతిని మన్నించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేసిందని తెలిపారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెఱిక కులమంతా ఒక్కటై గడప గడపకి వెళ్లి గెలుపిస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News