Thursday, January 23, 2025

నీరజ్ చోప్రా గ్రామంలో సంబరాలు !

- Advertisement -
- Advertisement -

 

celebrations in Neeraj Chopra home town

న్యూఢిల్లీ:  ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్‌ మెడల్‌ సాధించిన భారత జావెలిన్‌ స్టార్‌, ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. అతడో రైతు బిడ్డ. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, మాజీ ముఖ్యమంత్రి బుపీందర్ సింగ్ హుడా కూడా అతడిని అభినందించాడరు.  అతడి ఊరి మహిళలు నృత్యాలు చేసి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. హర్యానాలోని పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా(24) షోపీస్‌లో పతకం సాధించిన రెండవ భారతీయ మరియు మొదటి పురుష ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు. అతడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News