Saturday, June 29, 2024

అంబరాన్నంటిన సంబరాలు..

- Advertisement -
- Advertisement -

అఫ్గానిస్థాన్ టీమ్ టి20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో జట్టు ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు. అఫ్గాన్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద విజయంగా చెప్పాలి. గతంలో ఎన్నడూ కూడా అఫ్గాన్ ఐసిసి టోర్నీల్లో సెమీస్‌కు చేరలేదు. తొలిసారి ఈ ఘనత సాధించడంతో అఫ్గాన్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండ పోయింది. మ్యాచ్ గెలిచిన వెంటనే ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలారు. కెప్టెన్ రషీద్ ఖాన్, సీనియర్ మహ్మద నబితో సహా గుర్బాజ్, గుల్బదిన్, అజ్మతుల్లా, నవీనుల్ హక్‌లతో పాటు సహాయక సిబ్బంది కూడా సంబరాల్లో పాల్గొన్నారు.

మరోవైపు అఫ్గాన్‌లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తాలిబన్ ప్రభుత్వ పెద్దలు సయితం వేడుకల్లో పాల్గొన్నారు. అఫ్గాన్ టీమ్ సెమీస్‌కు చేరడంతో దేశంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ చూసేందుకు పలు ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద టివి స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే వేలాది మంది అభిమానులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సంబరాల్లో మునిగి పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News