Saturday, December 21, 2024

ఓట్ల కోసమే రెండు పార్టీల ఉత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -
  •  కాంగ్రెస్ పార్టీది కొంగజపం.. బిజెపిది దొంగ జపం
  •  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట:రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలంటే ఈ పార్టీ నాయకులు తోకముడిచి పారిపోయారని ఎద్దేవ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏడు మండలాలతో పాటు 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ప్రధాని మోడీ అప్పగించారని అన్నారు. ఏడు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అంధకారంలో కాంగ్రెస్ పాలకులు నెట్టారని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారని కాంగ్రెస్, బిజెపి నాయకులు వేడుకలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో ఊహకు అందని రీతిలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులైన బిఆర్‌ఎస్ శ్రేణులు దశాబ్ది వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గర్రం సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్ బాషామియా, మామిడి గౌరయ్య, మద్ది శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News