సిటీబ్యూరో: మాదిగల ఆత్మ గౌరవ పోరాటమే దండో రా ఉద్యమమని ఎంఆర్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. దండోరా ఉద్యమం మొదలై 28 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యానగర్‌లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు దండోరా పోరు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అణిచివేతను ఎదిరించి హక్కుల సాధన కోసం పుట్టిన దండోరా ఉద్యమంతో మాదిగల ఆత్మగౌరవం పెరిగిందని, సబ్బండ కుల ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు.
ఉవ్వెత్తున ఎగసిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం దండోరా ప్రేరణ అని గుర్తు చేశారు. తమ పోరాటాల మూలంగానే మాదిగలు, ఉప కులాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, పేరు పక్కన మాదిగ అని పెట్టుకునే స్థాయి వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా మొదలయిన దండోరా ఉద్యమం చిన్న పి ల్లల గుండె ఆపరేషన్‌లతో పాటు అనేక సంక్షేమ పథకాలకు నాంది ఆని వివరించారు. దండోరా ఉద్యమ చరిత్ర, పోరాటాలు, అమరుల త్యాగాలను స్మరించుకోవడమే లక్ష్యంగా ఈనెల 7వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు వార్షికోత్సవ వేడుకలను తలపెట్టమన్నారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుం చి రాజధాని వరకు జెండాలను ఎగురవేయాలని వంగపల్లి పిలుపునిచ్చారు . కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, తిరుమలేష్, సురేష్, శ్రీకాంత్, దయాకర్, జీవన్ శేఖర్, రాజేష్, జీవన్, శ్రీకాంత్, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.