Monday, December 23, 2024

ఘనంగా పల్లె ప్రగతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మాక్లూర్ : మాక్లూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలను ఘనంగాజరిపారు. గ్రామ సర్పంచు అశోక్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లెలను సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో పల్లెలవైపు చూసేవిధంగా పల్లెలను సిఎం కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధిపరిచారని అన్నార. ఈకార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి వెంకటేశ్వర రావు, మండల కోఆప్షన్ మెంబర్ కైమూద్ భాష, వార్డు మెంబర్ లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News