Friday, December 27, 2024

తెలంగాణ ప్రగతి ప్రతిబింభించేలా దశాబ్ది సంబురాలు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • శాఖల వారీగా పక్కా ప్రణాళికలతో నిర్ధేశిత కార్యక్రమాలు
  • భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ దశదిశా నిర్థేశం

భద్రాద్రి కొత్తగూడెం :తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు శాఖల వారీగా పక్కా ప్రణాళికలతో నిర్ధేశిత కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని మంత్రి పువ్వాడ అజయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రగతిని చాటుతూ నిర్వహించాలన్నారు.

వివిధ వర్గాల ప్రజలకు అమలు చేసిన పథకాలను కరపత్రాలు, ప్లెక్సీ, బుక్‌లెట్ల ద్వారా వివరించాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగం, పారిశ్రామిక ప్రగతి, విద్య, వైద్యం,సంక్షేమం, ఐటి రంగాల్లో సాధించిన పురోభివృద్ధిపై అవగాహన కల్పించాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం భాగస్వాములై ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలు, జిల్లా , మండల స్థాయిలో ఎంపిడిఒ, తహశీలార్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఇందుకోసం ప్రణాళికా బద్ధంగా పని చేయాలని దశ దిశా నిర్ధేశం చేశారు.

ఇందు కోసం అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా నిర్వహించాలని కోరారు. అనంతరం జూన్ రెండు నుంచి 21వ తేదీ వరకు నిర్వహించబోయే ఉత్సవాల షెడ్యూల్‌ను ప్రకటించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుందని, ఉత్సవాల విజయవంతానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, డిసీసీబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఐటిడిఎ పిఒ గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News