- Advertisement -
పహల్గామ్ ఉగ్రదాడిని టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన కోహ్లీ.. ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనతో తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని రోహిత్ తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు.
అలాగే, కేఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు.. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లుఅర్జున్, సూర్య, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
- Advertisement -