Monday, December 23, 2024

మాజీ సిఎం కెసిఆర్‌కు ప్రముఖుల పరామర్శలు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్‌ను పరామర్శించిన
సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్.వి.రమణ
సినీ హీరో నాగార్జున,వరప్రసాద్‌రెడ్డి తదితరులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తుంటి ఎముక గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పరామర్శలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి కెసిఆర్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి, సినీ హీరో నాగార్జున, సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ, శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, నాయకులు, అభిమానులు..అధినేత కెసిఆర్‌ను కలిసి పరామర్శించారు. ఆసుపత్రిలో మాజీ సిఎం కెసిఆర్ దగ్గర కెటిఆర్, జగదీశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

రేపు యశోద ఆసుపత్రి నుంచి కెసిఆర్ డిశ్చార్జ్

తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గత గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కెసిఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News