- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రముఖ సినీ నటులు, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ అండ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ సిఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి. సింధు తన కుటుంబ సభల్యులతో కలిసి సిఎంను కలిశారు. పుదుచ్చేరి మాజీ ముఖ్యంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రముఖ సినీ నటులు నాగార్జున దంపతులు, మేజర్ జనరల్ రాకేశ్ మనోచా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
- Advertisement -