Saturday, January 25, 2025

సినీ ప్రముఖుల నివాళులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కె.విశ్వనాథ్ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు పూలతో తుది నివాళులర్పించాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్, అల్లు అరవింద్, వెంకటేష్, డి.సురేష్‌బాబు, అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, చంద్రమోహన్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, నాగబాబు,రాజమౌళి, త్రివిక్రమ్, కీరవాణి, మురళీమోహన్, మణిశర్మ, గుణశేఖర్, సాయికుమార్, రాధిక, జీవిత, రాజశేఖర్, నాజర్, కోదండరామి రెడ్డి, బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, ఎల్‌బి శ్రీరామ్, మెహర్ రమేష్, శేఖర్ కమ్ముల తదితర సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్‌కు నివాళులర్పించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

“నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు”అని అన్నారు. – పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కళాతపస్వీ స్వర్గస్తులైనందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నాకు సినిమాలంటే తెలియని సమయంలో.. పాశ్చాత్య పాటలను ఇష్టపడే నాకు మన శాస్త్రీయ సంగీత పట్ల ఆసక్తి పెరిగేలా చేశారు.

యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే నా దృక్పథాన్ని ‘శంకరాభరణం’మార్చేసింది. కె.విశ్వనాథ్ తెలుగు సినిమాకు మూల స్తంభం”అని చెప్పారు. కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ “సెల్యూట్ టు ఎ మాస్టర్… కళాతపస్వి కె. విశ్వనాథ్ జీవిత పరమార్థాన్ని, కళ అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల అతని సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News