Wednesday, January 22, 2025

పెద్ద సంఖ్యలో సినీ, క్రీడా ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కెటిఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ అశ్విన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, క్రికెటర్ సచిన్, చాహల్, ధావన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు ఫార్ములా ఈ రేసును వీక్షించారు. కాగా, కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది. గ్యాలరీ నుంచి తమ ఫేవరెట్ జట్టు అయిన భారత్‌కు చెందిన మహీంద్రాకు సపోర్ట్ చేశారు.

శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలవగా, రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌లకు మంత్రి కెటిఆర్ బహుమతి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News