Thursday, December 26, 2024

సినీ ప్రముఖుల సంతాపం…

- Advertisement -
- Advertisement -

తారకరత్న మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. “తారకరత్న మరణవార్తతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాను. చాలా బాధగా ఉంది. ఎంతో ఆప్యాయత కురిపించే తారకరత్న ఇక లేరంటే నమ్మశక్యంగా లేదు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలి. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి”అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

“నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని పవన్ కల్యాణ్ చెప్పారు. “తారకరత్న మృతి తీవ్ర విషాదానికి గురిచేసింది. నా సోదరుడు చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి”అని మహేశ్‌బాబు తెలిపారు. “‘తారకరత్న మరణ వార్త విని చాలా బాధ పడ్డాను. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని అల్లు అర్జున్ అన్నారు.

“నందమూరి తారకరత్న మరణ వార్త విని నిజంగా షాక్ అయ్యాను. మనసంతా కలచివేసినట్లుగా అనిపించింది. నా అన్న నందమూరి తారక రామారావు మనవడు అయిన తారకరత్న నాకూ, నా కుటుంబానికి చాలా ఆత్మీయుడు. తారకరత్న ఎంత మంచివాడో, ఎంత సౌమ్యుడో, స్నేహశీలో చెప్పటానికి నాకు మాటలు రావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”అని మంచు మోహన్ బాబు తెలిపారు. తారకరత్న అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలచవేసిందని అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News