Tuesday, January 7, 2025

ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా పేలిన ఫోన్… చేతి వేలు తెగిపోయాయి

- Advertisement -
- Advertisement -

అమరావతి: సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వీడియోలు చూడటం కానీ, ఫోన్‌లో మాట్లాడడం కానీ చేయకూడదు. ఫోన్ హీటెక్కి త్వరగా పేలిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఫోన్, ల్యాప్‌టాప్ కానీ ఛార్జింగ్ పెట్టి వాడకూడదు. ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో ఓ బాలిక ఛార్జింగ్ పెట్టి వీడియో గేమ్‌లు అడుతుండగా అది పేలివడంతో ఆమె తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలిక సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతోంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ పేలడంతో ఆమె రెండు చేతివేళ్లు పూర్తిగా తెగిపోయాయి. బాలిక పొట్ట భాగంలో తీవ్రంగా గాయపడడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె రెండు చేతి వేళ్లు తొలిగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News