Saturday, December 21, 2024

విమానంలో పేలిన సెల్‌ఫోన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి డిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం 470లో ప్రయాణ దశలో సెల్‌ఫోన్ పేలింది. ఓ ప్రయాణికుడికి చెందిన సెల్ పేలిన ఘటనతో విమానంలో ఉన్నట్లుండి పొగలు వెలువడ్డాయి. దీనితో పైలట్ దీనిని తిరిగి వెనకకు మళ్లించి ఉదయ్‌పూర్ విమానంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ప్రయాణికులు భయభ్రాంతులు అయ్యారు. టేకాఫ్ తరువాత కొద్ది సేపటికి విమానంలో పేలుడు ఘటన జరిగింది. ఉదయ్‌పూర్‌కు తిరిగి చేరిన తరువాత సాంకేతిక సిబ్బంది వచ్చి పూర్తిగా తనిఖీలు చేశారు. తరువాత 140 మందితో కూడిన ఈ విమానం తిరిగి బయలుదేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News