Wednesday, January 22, 2025

సెల్ ఫోన్ల దొంగ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మొబైల్ షాపులో తాళాలు పగులగొట్టి సెల్ ఫోన్లను చోరీ చేసిన నిందితుడిని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌పై ఉంటే రాజన్ దాస్ అలియాస్ బ్లూటూత్ ఈ నెల 14వ తేదీన ఐఎస్ సదన్ సమీపంలోని యాదగిరి థియేటర్ సమీపంలోని టచ్ మొబైల్ షాపులో చోరీ చేశాడు. షాపుకు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తీసి వేసి షాపులోకి వెళ్లి మొబైల్ ఫోన్లను ఎత్తుకుని వెళ్లాడు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్లు కోనుగోలు చేస్తున్న నాంపల్లికి చెందిన రాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇన్స్‌స్పెక్టర్ ఆనంద్ కిషోర్, పిసిలు ముజఫర్, సైఫ్, విక్రం, సయిద్, శ్రీశైలం, చందశ్రేఖర్,శ్రీకాంత్, వేణు, సురేష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News