Monday, December 23, 2024

సెల్ ఫోన్ దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 6న సికింద్రాబాద్ లో రైలు ఎక్కేందుకు గోపాల్ అనే ఓ వృద్ధుడు రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. రైలు లేట్ కావడంతో  తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఆ వృద్ధుడు హబ్సీగూడలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యాడు.

ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్న వృద్ధుడిని రూ. 200 ఇస్తే దింపుతానని బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు దొంగ. ఆయన ఇంటి సమీంపలో రాత్రి 12 గంటలకు దించాడు. వృద్ధుడు ఫోన్ ద్వారా పేమెంట్ చేసేందుకు ప్రయత్నిస్తే కుదరలేదు. జేబులో నుంచి డబ్బు తీసి లెక్కపెట్టుతుండగా ఆ మోసగాడు రూ.1700 నగదు, సెల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. దాంతో ఆ పెద్దాయన దగ్గరలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అగాంతకుడు ఫోన్ ను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా శుక్రవారం పట్టుకున్నారు. నిందితుడిని ఆంథోని ఫెలిక్స్ ఖాన్(29)గా గుర్తించారు. అతడు ఇదివరలో బోయిన్పల్లి డైమండ్ పాయింట్ హోటల్ వద్ద నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఇటీవల అతడి ఉద్యోగం పోవడంతో చోరీలకు అలవాటు పడ్డాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఏసిపి గ్యార జగన్, సిఐ రాజేందర్ అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News