Wednesday, January 22, 2025

సెల్ పోన్ల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ బృందం, రాయదుర్గం పోలీసులు బుధవారం సెల్ పోన్ దొంగతనం రాకెట్‌ను చేధించారు. వివిధ కంపెనీలకు చెందిన మొబైల్ పోన్లను దొంగలించి ఇతర రాష్ట్రాల్లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలోని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి వివిధ కంపెనీలకు చెందిన 563 మొబైల్ పోన్లతో పాటు ఓ కారు, రూ.3లక్షల నగదు, నిందుతుడి రెండు వ్యక్తిగత సెల్ పోన్లు, మెత్తం రూ.1.92 కోట్లు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డిసిపి వెల్లడించారు. మొత్తం నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడిసెల్ పోన్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇందులో ఎల్‌బినగర్‌లో నివాసం ఉంటున్న గరడి రామంజీని అరెస్టు చేయగా,

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకాశ్, సన్నీ, కర్నాటకకు చెందిన వంశీ లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పట్టుబడ్డ నిందుతుడు రామంజీ కడప జిల్లా వాసి కాగా, ఎల్‌బినగర్‌లో నివాసం ఉంటు న్నారని, ఆయన గతంలో 1995 నుంచి 2005 వరకు ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహించగా, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి నష్టపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో సెల్ పోన్ల దొంగతనానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే అతనిపై వివిధ పోలీసు స్టేషన్‌లో కేసులున్నాయని వెల్లడించారు. ఇదేక్రమంలో బుధవారం తెల్లవారు జామున అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో నిందుతుడు 510 సెల్ పోన్లను తరలిస్తు పట్టుబడ్డారని డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News